సన్నీ తర్వాతే.. | Sunny Leone tops Yahoo Most Searched Celebrity 2017 list | Sakshi
Sakshi News home page

సన్నీ తర్వాతే..

Dec 3 2017 1:16 AM | Updated on Dec 3 2017 1:27 AM

Sunny Leone tops Yahoo Most Searched Celebrity 2017 list - Sakshi

ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పడుకోన్‌.. వంటి స్టార్‌ హీరోయిన్లను సైతం వెనక్కు నెట్టేసి టాప్‌ ప్లేస్‌లో నిలిచారు హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌. యాహూ సెర్చింగ్‌లో ఎక్కువమంది వెతికిన సెలబ్రిటీల జాబితాలో సన్నీ లియోన్‌ తొలి స్థానం పొందారు. యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ–2017 జాబితాలో సన్నీ మొదటి స్థానం దక్కించుకోగా ప్రియాంకా చోప్రా రెండో స్థానంలో నిలిచారు.

మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యా రాయ్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కత్రినాకైఫ్, దీపికా పడుకోన్, కరీనా కపూర్, మమతా కులకర్ణి నిలిచారు. నటుల్లో దివంగత వినోద్‌ ఖన్నా టాప్‌ ప్లేస్‌లో నిలవడం విశేషం. కమెడియన్, యాంకర్‌ కపిల్‌ శర్మ రెండో స్థానంలో నిలవగా, బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్, తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement