సన్నీ లియోన్ కోసం గూగుల్లో గాలింపు! | Sunny leone topped google search in persons category | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్ కోసం గూగుల్లో గాలింపు!

Dec 18 2013 4:43 PM | Updated on Dec 27 2018 4:17 PM

గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానంలో ఉన్న సన్నీలియోన్ - Sakshi

గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానంలో ఉన్న సన్నీలియోన్

ఈ సంవత్సరం మొత్తం మీద గూగుల్లో అత్యధికంగా ఎవరి కోసం సెర్చ్ చేశారో తెలుసా? బూతు చిత్రాల నటీమణి సన్నీ లియోన్ కోసం.

ఈ సంవత్సరం మొత్తం మీద గూగుల్లో అత్యధికంగా ఎవరి కోసం సెర్చ్ చేశారో తెలుసా? బూతు చిత్రాలతో మొదలుపెట్టి, ఇటీవలి కాలంలో షారుక్ ఖాన్ కూడా ఆమెతో కలిసి సినిమా చేయాలని ఉందంటూ చెప్పిన సన్నీ లియోన్. కత్రినా కైఫ్, దీపికా పదుకొనే లాంటి అగ్రతారలను సైతం ఆమె ఈ వెదుకులాటలో వెనక్కి నెట్టేసింది. ఇలా వివిధ సినీ నటుల కోసం చేసిన సెర్చ్లో అగ్రస్థానంలోను, చిట్టచివరి స్థానంలో కూడా సెక్సిణులే ఉండటం గమనార్హం. మొదటి స్థానంలో సన్నీ లియోన్, పదో స్థానంలో పూనమ్ పాండే ఉన్నారు. ఇప్పుడంటే పూనమ్ పాండే వార్తల్లో లేదు గానీ, అంతకుముందు భారత్ విజయం సాధిస్తే తాను నగ్నంగా పోజులిస్తానంటూ బహిరంగంగా చెప్పి విపరీతంగా వార్తల్లో నిలిచింది.

గూగుల్ సెర్చ్లో టాప్ టెన్ స్థానాల్లో నిలిచిన వ్యక్తులు ఎవరెవరో చూస్తే.. వరుసగా సన్నీ లియోన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, షారుక్ ఖాన్, హనీ సింగ్, కాజల్ అగర్వాల్, కరీనా కపూర్, సచిన్ టెండూల్కర్, పూనమ్ పాండే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement