సన్నీలియోన్ ఐస్ బకెట్ చాలెంజ్! | Sunny Leone takes the Ice Bucket Challenge | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్ ఐస్ బకెట్ చాలెంజ్!

Aug 24 2014 5:04 PM | Updated on Apr 3 2019 6:23 PM

సన్నీలియోన్ ఐస్ బకెట్ చాలెంజ్! - Sakshi

సన్నీలియోన్ ఐస్ బకెట్ చాలెంజ్!

ఐస్ బకెట్ ఛాలెంజ్' కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ సై అంటున్నారు.

ఐస్ బకెట్ ఛాలెంజ్' కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్  సై అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీలియోన్ చేరిపోయారు.  ఈ బాలీవుడ్ భామను ఆమె కుటుంబ సభ్యులు, ట్విట్టర్ అభిమానులు కోరడంతో ఆమె ఐస్ బకెట్ చాలెంజ్ ను సవాల్ గా స్వీకరించారు.  అతి చల్లటి నీటితో తడిసిముద్దయిన సన్నీలియోన్ కాసేపు  మెలికలు తిరిగిపోతూ కాసేపు వయ్యారాలు పోయారు. అనంతరం ఆమె గాయకుడు హానీ సింగ్ ను ఈ పోటీకి నామినేట్ చేశారు.
 
లా గెరిగ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధికి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఎవరైనా ఐస్ నీళ్లతో స్నానం చేసి.. మరి కొంతమందికి ఛాలెంజ్ ను విసరడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ ఛాలెంజ్ ను ప్రపంచంలోని ప్రముఖలందరూ స్వీకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement