మన పక్కింటి కుర్రాడు! | Sunny Leone key role in manchu manoj current teega | Sakshi
Sakshi News home page

మన పక్కింటి కుర్రాడు!

Aug 28 2014 10:59 PM | Updated on Sep 2 2017 12:35 PM

మన పక్కింటి కుర్రాడు!

మన పక్కింటి కుర్రాడు!

యువతకు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే కథానాయకుల్లో మనోజ్ ఒకరు. జోష్‌గా ఉండే పాత్రలను రక్తి కట్టించడంలో మనోజ్ స్టయిలే వేరు. ప్రస్తుతం ఆయన ‘కరెంట్ తీగ’ చిత్రం చేస్తున్నారు.

యువతకు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే కథానాయకుల్లో మనోజ్ ఒకరు. జోష్‌గా ఉండే పాత్రలను రక్తి కట్టించడంలో మనోజ్ స్టయిలే వేరు. ప్రస్తుతం ఆయన ‘కరెంట్ తీగ’ చిత్రం చేస్తున్నారు. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రం పూర్తయ్యింది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇందులో మనోజ్‌ది మన పక్కింటి కుర్రాడి తరహా పాత్ర. తను చేసిన డేర్ డెవిల్ స్టంట్స్, అచ్చు స్వరపరచిన పాటలు ఈ చిత్రానికే హైలైట్. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం ఇది’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్ కీలక పాత్ర చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement