సన్నీలియోన్‌ కన్నీరుమున్నీరు.. | Sunny Leone Broke Down Watching Documentary | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్‌ కన్నీరుమున్నీరు..

May 26 2018 4:16 PM | Updated on May 26 2018 8:05 PM

Sunny Leone Broke Down Watching Documentary - Sakshi

సన్నీలియోన్‌ (పాత ఫొటో)

ముంబై : బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ కన్నీరుమున్నీరయ్యారట. ఈ రాత్రి నా హృదయం వెయ్యి ముక్కలైందంటూ బుధవారం రాత్రి ఆమె ట్వీట్‌ చేశారు. సన్నీ ట్వీట్‌ వెనుక ఆమె జీవిత పయనం ఉంది. అవును తన జీవిత గాథను చిత్ర రూపంలో వీక్షించిన అనంతరం సన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘కరణ్‌ జీత్‌ కౌర్‌-ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీలియోన్‌’అనే డాక్యుమెంటరీని సన్నీ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.

కరణ్‌ జీత్‌ కౌర్‌ సన్నీ అసలు పేరు. పోర్న్‌స్టార్‌గా సన్నీ ఎలా మారారు. ఏ పరిస్థితుల్లో ఆమె అటువైపు అడుగేశారనే విషయాలను డాక్యుమెంటరీలో చూపించినట్లు తెలుస్తోంది. కాగా, తనపై రూపొందిన డాక్యుమెంటరీని ప్రత్యేక ప్రదర్శనతో వీక్షించిన సన్నీ భావోద్వేగానికి గురయ్యారు.

‘నీలి చిత్రాల ప్రపంచంలోకి రాకముందు తాను ఎలా ఉండేదాన్నో.. అలా మళ్లీ కావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు ఎప్పటికీ రాదని నాకు తెలుసు. నా పాత వ్యక్తిత్వం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. డాక్యుమెంటరీ చూసిన తర్వాత తప్పు చేశానన్న భావన కలిగింది.’అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement