జక్కన్న జాలీ ట్రిప్! | Sunil New Movie Jakkana | Sakshi
Sakshi News home page

జక్కన్న జాలీ ట్రిప్!

Jun 5 2016 2:05 AM | Updated on Sep 4 2017 1:40 AM

జక్కన్న జాలీ ట్రిప్!

జక్కన్న జాలీ ట్రిప్!

జక్కన్న సరదాగా తనకు నచ్చిన అమ్మాయితో దుబాయ్ అంతా చుట్టేశాడు. అక్కడి వీధుల్లో తన అందాల రాశితో...

జక్కన్న సరదాగా తనకు నచ్చిన అమ్మాయితో దుబాయ్ అంతా చుట్టేశాడు.  అక్కడి వీధుల్లో తన అందాల రాశితో ఎంచక్కా  డ్యూయెట్లు పాడేసుకున్నాడు.  వీరిద్దరి ఆటాపాటల సందడేంటో తెలియాలంటే  ‘జక్కన్న’ చూడాల్సిందే అంటున్నారు చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. సునీల్, మన్నార్ చోప్రా జంటగా ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘జక్కన్న’. ఈ చిత్రం కోసం ఇటీవల దుబాయ్‌లో ఓ పాట చిత్రీకరించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఊహించని ట్విస్టులతో ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ నెలలోనే పాటలను, జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దినేశ్, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్, సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement