సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’ | sunil new movie first look | Sakshi
Sakshi News home page

సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’

Dec 16 2015 8:59 PM | Updated on Sep 3 2017 2:06 PM

సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’

సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’

సునీల్ నూతన చిత్రం ఈడు గోల్డ్ ఎహే త్వరలోనే ప్రారంభం కానుంది.

పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో నూతన చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే' త్వరలోనే ప్రారంభం కానుంది.

గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ వంటి సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ ను నిర్మించిన  ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందనునున్న ఈ చిత్రంలో హీరోయిన్ సహా మిగతా నటీనటులు. టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement