పెద్ద హీరో కోసం రాసిన కథను నాతో తీస్తున్నారు : సునీల్ | Sunil - 'Josh' Vasu Varma film launch today | Sakshi
Sakshi News home page

పెద్ద హీరో కోసం రాసిన కథను నాతో తీస్తున్నారు : సునీల్

Aug 20 2014 11:40 PM | Updated on Sep 2 2017 12:10 PM

పెద్ద హీరో కోసం రాసిన కథను నాతో తీస్తున్నారు : సునీల్

పెద్ద హీరో కోసం రాసిన కథను నాతో తీస్తున్నారు : సునీల్

సునీల్ హీరోగా వాసూ వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది.

సునీల్ హీరోగా వాసూ వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కీరవాణి కెమెరా స్విచాన్ చేయగా, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. సునీల్ మార్క్ కామెడీ, ‘దిల్’ రాజు చిత్రాల తరహాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ ఉన్న కథ ఇదని చిత్ర కథారచయిత కోన వెంకట్ అన్నారు.
 
  ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘గోపిచంద్ మలినేని, కోన వెంకట్ తయారు చేసుకున్న ఈ కథలో ఉన్న వినోదం నచ్చి, చేయాలనుకున్నాను. వాసూ వర్మ చాలా టాలెంటెడ్. వచ్చే నెల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఓ పెద్ద హీరో కోసం రాసుకున్న కథను తనతో తీయడం ఆనందంగా ఉందని సునీల్ అన్నారు. మంచి చిత్రం అవుతుందని వాసూవర్మ చెప్పారు. ఈ చిత్రం ద్వారా దినేష్‌ను సంగీతదర్శకునిగా పరిచయం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement