‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’ | Sundeep Kishan Tenali Ramakrishna Telugu Movie Trailer Out | Sakshi
Sakshi News home page

‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’

Nov 10 2019 3:40 PM | Updated on Nov 10 2019 3:40 PM

Sundeep Kishan Tenali Ramakrishna Telugu Movie Trailer Out - Sakshi

సందీప్‌ కిషన్‌ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక. హన్సిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించారు. నవంబర్‌ 15న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్‌, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాపై సందీప్‌ అండ్‌ టీమ్‌ చాలా హోప్స్‌ పెట్టుకుంది. ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సందీప్‌ కిషన్‌ పెర్ఫార్మెన్స్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలెట్‌గా నిలిచింది. ఇక ఇదే ఈవెంట్‌లో చిత్ర ట్రైల్రర్‌ను కూడా విడుదల చేశారు.
 

‘ఒరేయ్‌ తెనాలి సౌతిండియా షాపింగ్‌ మాల్‌లో కూడా ఇన్ని ఆఫర్లు ఉండువురా’, ‘పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఫ్రీగా పంచినట్టు దీనికెవరో లాయర్‌ పట్టా ఫ్రీగా ఇచ్చారు’, ‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’,అంటూ వినోద్మాత్మకంగా సాగే డైలాగ్‌లతో పాటు.. చివర్లో ‘సివిల్‌ కేసులు కాంప్రమైజ్‌ చేయోచ్చు.. క్రిమినిల్‌ కేసులు కావు, క్రిమినల్స్‌ మస్ట్‌ బి పనిష్డ్‌’అంటూ సందీప్‌ కిషన్‌ చెప్పే పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఇక సాయి కార్తీక్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ చింపేశాడు. కామెడీ ఎంటర్‌ట్రైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్‌ శ్రీను, పృథ్వి, రఘుబాబు, చమ్మక్‌ చంద్ర, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ తదితరులు నటించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్‌.ఎన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement