కృష్ణవంశీ నక్షత్రం | Sundeep Kishan - Krishna Vamsi's Nakshatram Launched | Sakshi
Sakshi News home page

కృష్ణవంశీ నక్షత్రం

Apr 27 2016 10:59 PM | Updated on Sep 15 2019 12:38 PM

కృష్ణవంశీ నక్షత్రం - Sakshi

కృష్ణవంశీ నక్షత్రం

చేసే సినిమాలన్నీ వెరైటీగా ఉండాలని కోరుకుంటారు దర్శకుడు కృష్ణవంశీ. వెరైటీ పాత్రలే చేయాలనుకుంటారు హీరో సందీప్ కిషన్.

చేసే సినిమాలన్నీ వెరైటీగా ఉండాలని కోరుకుంటారు దర్శకుడు కృష్ణవంశీ. వెరైటీ పాత్రలే చేయాలనుకుంటారు హీరో సందీప్ కిషన్. ఇప్పటివరకూ దాదాపు అలాంటి పాత్రలే చేసుకుంటూ వచ్చారాయన. ఇక.. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డెరైక్టర్‌తో సినిమా అంటే.. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, కొత్త లుక్‌లో సందీప్ కనిపిస్తారని ఊహించవచ్చు.
 
 ఆ ఒక్క చాన్స్ దక్కించేసుకున్నారు సందీప్ కిషన్. బుట్టబొమ్మ క్రియేషన్స్ కె.శ్రీనివాసులు, విన్ విన్ విన్ క్రియేషన్స్ ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. సినిమా టైటిల్  ‘నక్షత్రం’. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ- ‘‘పోలీస్ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథే ఈ చిత్రం. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నాం’’ అని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement