సౌత్లో మరో భారీ సినిమా..! | sun pictures movie with vijay, murugadoss | Sakshi
Sakshi News home page

సౌత్లో మరో భారీ సినిమా..!

May 19 2017 1:22 PM | Updated on Sep 5 2017 11:31 AM

సౌత్లో మరో భారీ సినిమా..!

సౌత్లో మరో భారీ సినిమా..!

బాహుబలి ఘనవిజయం సాధించటంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్ చిత్రాలను ఎనౌన్స్ చేస్తున్నాయి. ఇప్పటికే

బాహుబలి ఘనవిజయం సాధించటంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్ చిత్రాలను ఎనౌన్స్ చేస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్, రోబో సీక్వల్ సెట్స్ మీద ఉండగా సంఘమిత్ర ప్రారంభమైంది. అల్లు అరవింద్ రామాయణాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా మరో భారీ చిత్రంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం మహేష్తో స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మురుగదాస్, తరువాత కూడా భారీ బడ్జెట్ చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నాడు.

తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన విజయ్ కాంబినేషన్లో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. మురుగదాస్ మార్క్ సోషల్ ఎలిమెంట్తో పాటు విజయ్ స్టైల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. రోబో తరువాత సినిమా నిర్మాణానికి దూరమైన సన్ పిక్చర్స్ మురుగదాస్, విజయ్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తోంది. దాదాపు 120 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement