మళ్లీ విభిన్న కథాంశంతో సుమంత్‌ | Sumanth to play a news photographer in upcoming thriller | Sakshi
Sakshi News home page

విభిన్న కథాంశంతో రాబోతున్న సుమంత్‌

Jan 1 2018 4:07 PM | Updated on Jan 1 2018 4:36 PM

Sumanth to play a news photographer in upcoming thriller - Sakshi

చాలా కాలంగా హిట్‌ కోసం ఎదురుచూసిన సుమంత్‌కు 'మళ్లీరావా' మంచి బూస్ట్‌నిచ్చింది. సత్యం, గోదావరి తరువాత మళ్లీ తన కెరీర్‌లో ఈ సినిమా ప్లస్‌ అయింది. అయితే మధ్యలో చాలా సినిమాలు చేసినా సమంత్‌కు విజయం దక్కలేదు. నరుడా డోనరుడా (హిందీ సినిమా ‘విక్కీ డోనర్’‌) తెలుగులో కొత్త కథే అయినా అది ప్రేక్షకులకు చేరుకోలేకపోయింది. చాలాకాలం తర్వాత మంచి కథాంశంతో, తనకు సరిపోయే ప్రేమకథా చిత్రంతోనే మళ్లీ సక్సెస్‌ అందుకున్నారు.

ఈ ఉత్సాహంలో మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సుమంత్‌ నిద్ర సమస్యతో బాధపడే పత్రిక ఫోటోగ్రాఫర్‌ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తనకు ఉన్న సమస్యతో ఎదురయ్యే సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరించుకుంటాడనేదే సినిమా కథ అని సమాచారం. అనిల్‌కుమార్‌ ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అనిల్‌ ఈ చిత్రాన్ని సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఇక మళ్లీరావా బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఏ-సెంటర్లలో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. హిందీ టీవీ సీరియల్‌ నటి ఆకాంక్ష సింగ్‌ మళ్లీరావాతో హీరోయిన్‌గా పరిచయం అయింది.

Advertisement
 
Advertisement
Advertisement