ఐస్‌క్రీములు అమ్మిన సుమంత్ | Sumanth in Memusaitam program | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీములు అమ్మిన సుమంత్

Nov 3 2016 10:51 PM | Updated on Sep 4 2017 7:05 PM

ఐస్‌క్రీములు అమ్మిన సుమంత్

ఐస్‌క్రీములు అమ్మిన సుమంత్

ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులకు అండగా టాలీవుడ్ తారలు

ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులకు అండగా టాలీవుడ్ తారలు, జెమినీ టీవీ ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ వారం నేను సైతం అంటూ సుమంత్ ముందుకొచ్చారు.

పిల్లలు పుట్టలేదని భర్త వదిలి వేయడంతో పుట్టింటికి చేరిన సుల్తానా, అప్పటికే కూతుళ్ల పెళ్లిళ్లు చేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుల్తానా తల్లి... ఈ నిరుపేద తల్లీకూతుళ్లకు అండగా హీరో సుమంత్ ఐస్‌క్రీమ్స్ అమ్మారు. నిస్సహాయ తల్లీకూతుళ్లను ఆదుకోవడానికి సుమంత్ చేసిన వినూత్న సేవతో ‘మేము సైతం’ కార్యక్రమం ఈ శనివారం రాత్రి 9:30 ని.లకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement