కథ విని షాకయ్యా – సుమంత్‌ | Sumanth’s Malli Raava Gets Release december 8 | Sakshi
Sakshi News home page

కథ విని షాకయ్యా – సుమంత్‌

Nov 24 2017 12:12 AM | Updated on Nov 24 2017 12:12 AM

Sumanth’s Malli Raava Gets Release december 8 - Sakshi

విడిపోయి పదమూడేళ్లు గడిచిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఒకరిని గుర్తుపెట్టుకుంటే, ఆ వ్యక్తిపై ప్రేమ అయినా ఉండాలి. ద్వేషం అయినా ఉండాలి. కార్తీక్‌ కూడా అంజలిని గుర్తుపెట్టుకున్నాడు. మరి ప్రేమతోనా?.. ద్వేషంతోనా? అనేది తెలియాలంటే మా సినిమా చూడాలంటున్నారు కథానాయకుడు సుమంత్‌. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘మళ్ళీ రావా..’. ఆకాంక్షా సింగ్‌ కథానాయిక. రాహుల్‌ నక్క నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 8న విడుదల చేయనునున్నారు. తాజాగా చిత్రం ఆడియో టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

సుమంత్‌ మాట్లాడుతూ– ‘‘ఏడాది క్రితం గౌతమ్‌ చెప్పిన కథ విని షాక్‌ అయ్యా. కళ్లు మూసుకుని సినిమా చేయవచ్చు అనిపించింది. నేచురల్‌ లవ్‌స్టోరీ. ‘గోదావరి’ చిత్రం తర్వాత అంత సంతృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘కార్తీక్‌– అంజలిల మధ్య నడిచే లవ్‌స్టోరీ డ్రామానే చిత్రకథ. 30 రోజుల్లో షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. శ్రవణ్‌ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. సుమంత్‌గారు బాగా సపోర్ట్‌ చేశారు. ఆయనకు థ్యాంక్స్‌’’ అన్నారు రాహుల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement