అమరం.. అఖిలం.. ప్రేమ! | sukumar new movie started | Sakshi
Sakshi News home page

అమరం.. అఖిలం.. ప్రేమ!

Dec 2 2016 11:44 PM | Updated on Sep 4 2017 9:44 PM

అమరం.. అఖిలం.. ప్రేమ!

అమరం.. అఖిలం.. ప్రేమ!

ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రతి సినిమాలోనూ తప్పకుండా ఉంటుంది కూడా.

 ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రతి సినిమాలోనూ తప్పకుండా ఉంటుంది కూడా. అయితే.. ప్రేమను సరికొత్తగా చూపడంలో దర్శకుడు సుకుమార్‌ది ప్రత్యేకమైన శైలి. కథ అందించడంతో పాటు నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’, దర్శకత్వం వహించిన ‘ఆర్య’, ‘100% లవ్’ చిత్రాలు సుకుమార్ శైలిని స్పష్టం చేశాయి. ఇప్పుడాయన అందరూ కొత్తవాళ్లతో ఓ ప్రేమకథా చిత్రం నిర్మిస్తున్నారు. సుకుమార్ దగ్గర కో-డెరైక్టర్‌గా పనిచేసిన జనార్థన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ‘అమరం.. అఖిలం.. ప్రేమ’ అనే టైటిల్ ఖరారు చేశారట! ఈ చిత్రానికి ‘అందాల రాక్షసి’ ఫేమ్ రధన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement