జీవితాలను మార్చే సీడీ | Sukumar About Ctrl C Movie | Sakshi
Sakshi News home page

జీవితాలను మార్చే సీడీ

Jul 2 2015 11:29 PM | Updated on Sep 3 2017 4:45 AM

జీవితాలను మార్చే సీడీ

జీవితాలను మార్చే సీడీ

అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు ప్రాణాలతో బయటపడిన ఓ జంటకు ఓ సీడీ దొరుకుతుంది. ఆ సీడీ వారి జీవితాలను ఎలా మార్చింది?

 ‘‘అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు ప్రాణాలతో బయటపడిన ఓ జంటకు ఓ సీడీ దొరుకుతుంది. ఆ సీడీ వారి జీవితాలను ఎలా మార్చింది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ జానర్ సినిమా ఇప్పటివరకూ రాలేదు. నైట్ ఎఫెక్ట్ విజువల్స్ చూశాను. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. మా అశోక్ డెరైక్టర్ అవుతాడనుకున్నా. కానీ, హీరో అయ్యాడు’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు.
 
 ఆయన సోదరుడి తనయుడు అశోక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘కంట్రోల్ సి’. సెకండ్ ఇండిపెండెన్స్ పతాకంపై అశోక్, దిశా పాండే జంటగా సాయిరామ్ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్ ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ని హైదరాబాద్‌లో సుకుమార్ ఆవిష్కరించారు. సాఫ్ట్‌వేర్ క్యాంపస్‌లో జరిగే థ్రిల్లర్ మూవీ ఇదని దర్శక నిర్మాతలు తెలిపారు. ఊహించని విధంగా ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నానని అశోక్ తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: విజయ్ మోహన్‌రెడ్డి బాతుల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీధర్ సనగాల.

Advertisement
 
Advertisement
Advertisement