సండే ఫన్‌డే | Srinivasa Kalyanam Shooting Begins Hero Nithin, Heroin Raashi khanna | Sakshi
Sakshi News home page

సండే ఫన్‌డే

May 21 2018 1:55 AM | Updated on May 21 2018 1:55 AM

Srinivasa Kalyanam Shooting Begins Hero Nithin, Heroin Raashi khanna - Sakshi

రోజులో పన్నెండు గంటలంటే.. హాఫ్‌ డే. షూటింగ్స్‌తో బాగా అలసిపోయిన కథానాయిక రాశీ ఖన్నా కూడా  హాఫ్‌డే నిద్రపోవాలనుకున్నారు. కానీ, ‘శ్రీనివాస కల్యాణం’ షూటింగ్‌లో పాల్గొన్నారు. నితిన్‌ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. ఇందులో రాశీఖన్నా, నందిత శ్వేతా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘‘పన్నెండు గంటల నిద్ర అవసరం.

కానీ వర్క్‌ చేయాలి. అది సండే అయినప్పటికీ కూడా’’ అని సరదాగా లొకేషన్‌ పిక్‌ను షేర్‌ చేశారు రాశీఖన్నా. అయినా.. వర్క్‌ పట్ల ఆమె ఎంతో డెడికేటెడ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను ఢిల్లీ, పంజాబ్, చండీఘడ్‌.. ఇలా నార్త్‌ ఇండియాలో షూట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘సండే అయినా సెట్‌లో ఫుల్‌ ఫన్‌ ఉంది. సండే ఫన్‌ డే’ అని పేర్కొంది చిత్ర బృందం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement