వెంకటేశ్‌ వాయిస్‌తో... | Srinivasa Kalyanam has voice over by Venkatesh | Sakshi
Sakshi News home page

వెంకటేశ్‌ వాయిస్‌తో...

Aug 5 2018 1:55 AM | Updated on Aug 5 2018 1:55 AM

Srinivasa Kalyanam has voice over by Venkatesh - Sakshi

వెంకటేశ్‌,సతీష్‌ వేగేశ్న

వెంకటేశ్‌ సూపర్‌ హిట్‌ సినిమాల్లో కచ్చితంగా గుర్తుకు వచ్చేది ‘శ్రీనివాస కళ్యాణం’. 30 ఏళ్ల తర్వాత అదే టైటిల్‌తో పెళ్లి గొప్పతనాన్ని, విశిష్టతని తెర మీద అందంగా చూపించడానికి రెడీ అయ్యారు ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న. ఇప్పుడు ఈ శ్రీనివాస కళ్యాణానికి ఆ ‘శ్రీనివాస కళ్యాణం’ హీరో వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల  9న విడుదల కానుంది. ఈ సినిమా వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌తో స్టార్ట్‌ కానుందట. దీనికి సంబంధించిన డబ్బింగ్‌ పనులు కూడా వెంకీ కంప్లీట్‌ చేశారు. ‘‘వెంకటేశ్‌గారి వాయిస్‌ ఓవర్‌తో మా సినిమా మొదలవుతుంది. మా సినిమా కోసం మీ వాయిస్‌ వినిపించినందుకు చాలా థ్యాంక్స్‌ సార్‌’’ అని చిత్రబృందం పేర్కొంది.  రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజŒ , జయసుధ, నరేశ్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్‌.

చిన్నోడికీ పెద్దోడికీ థ్యాంక్స్‌
‘‘మల్టీస్టారర్‌ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నుంచి శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌తో వెంకటేశ్, మహేశ్‌కు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అందులో  వెంకటేశ్, మహేశ్‌ పెద్దోడు, చిన్నోడుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే మా బ్యానర్‌లో వెంకటేశ్‌ ‘ఎఫ్‌ 2’, మహేశ్‌ బాబు 25వ సినిమా    రూపొందుతున్నాయి. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ను పెద్దోడు వెంకటేశ్, చిత్రం ట్రైలర్‌ను చిన్నోడు మహేశ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా చిన్నోడు, పెద్దోడికి స్పెషల్‌ థ్యాంక్స్‌ చెబుతున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement