ఖర్చు తగ్గిందన్నమాట! | Srinivasa Kalyanam First Look | Sakshi
Sakshi News home page

ఖర్చు తగ్గిందన్నమాట!

Mar 5 2018 1:08 AM | Updated on Mar 5 2018 1:08 AM

Srinivasa Kalyanam First Look  - Sakshi

సోషల్‌ మీడియాలో ఒకటే చర్చ. హీరో నితిన్‌ పెళ్లి గురించి. పెళ్లికొడుకు గెటప్‌లో ఉన్న ఫోటోను నితిన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడమే ఇందుకు కారణం. కానీ నితిన్‌ పెళ్లికొడుకుగా మారింది రియల్‌ లైఫ్‌లో కాదు. రీల్‌ లైఫ్‌లోనే. ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో నితిన్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కల్యాణం’. ఇందులో రాశీఖన్నా, నందిత శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. ఆల్మోస్ట్‌ 14 ఏళ్ల తర్వాత నితిన్, ‘దిల్‌’ రాజుల కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతుండటం విశేషం. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు.

చిత్రీకరణ మొదలైంది. ‘‘ ఈ నెల 16 నుంచి రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్‌ కానుంది. ఈ షెడ్యూల్‌ ఈ నెల 30 వరకు జరుగుతుంది. ఈ ఏడాది జూన్‌ కల్లా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసి, జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జె. మేయర్, కెమెరా: సమీర్‌ రెడ్డి. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే..‘‘మ్యారేజ్‌కి కెమెరామెన్‌ అవసరం లేదన్నా, ఇవే పెళ్లి ఫొటోలు అని పోస్ట్‌ చేసినా నమ్మేలా ఉన్నాయ్‌’’ అని ఓ నెటిజన్‌ నితిన్‌ పోస్ట్‌ చేసిన ఈ సినిమా ఫొటోను ఉద్దేశించి అన్నాడు. ‘ఖర్చు తగ్గిందన్నమాట’ అంటూ సరదాగా అతనికి బదలు ఇచ్చాడు నితిన్‌.

Advertisement
 
Advertisement
Advertisement