నిర్మలా కాన్వెంట్‌లో శ్రీకాంత్ వాళ్ళబ్బాయి | Srikanth's Son Roshan First Look in Nirmala Convent! | Sakshi
Sakshi News home page

నిర్మలా కాన్వెంట్‌లో శ్రీకాంత్ వాళ్ళబ్బాయి

Jan 21 2016 10:45 PM | Updated on Sep 3 2017 4:03 PM

నిర్మలా కాన్వెంట్‌లో శ్రీకాంత్ వాళ్ళబ్బాయి

నిర్మలా కాన్వెంట్‌లో శ్రీకాంత్ వాళ్ళబ్బాయి

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం

 హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం సెలైంట్‌గా షూటింగ్ జరుపుకొంటోంది. హీరో నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. జి. నాగకోటేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘దూకుడు’ తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఇందులో నాయిక. నాగార్జున ఇందులో ప్రత్యేక పాత్ర చేయనున్నారు. ఫిబ్రవరిలో ఆయన వెర్షన్ షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, కెమెరా: ఎస్.వి విశ్వేశ్వర్.
 

Advertisement
 
Advertisement
Advertisement