నిన్ను మస్తు లవ్‌ చేశిన.. బ్యాండ్‌మేళం ట్రైలర్‌ | Harsh Roshan, Sridevi Starrer Band Melam Movie Trailer Released | Sakshi
Sakshi News home page

నిన్ను మస్తు లవ్‌ చేశిన.. ఎమోషనల్‌గా 'బ్యాండ్‌మేళం' ట్రైలర్‌

Mar 21 2026 12:10 PM | Updated on Mar 21 2026 12:19 PM

Harsh Roshan, Sridevi Starrer Band Melam Movie Trailer Released

కోర్ట్‌ జంట హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్యాండ్‌ మేళం. సతీష్‌ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం (మార్చి 21న) విడుదల చేశారు. చిన్నప్పుడే మా అమ్మ సచ్చిపోతే నా అన్నని మా అమ్మ లెక్క చూసుకున్న.. నేనడిగితే పాణం కూడా ఇస్తడు అన్న డైలాగ్‌తో వీడియో మొదలయింది. 

ఎమోషనల్‌గా ట్రైలర్‌
నేను నిన్ను మస్తు లవ్‌ చేశిన.. కానీ, నువ్వు నన్ను దేఖలే.., నువ్వు వచ్చినతర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్‌.. నన్ను ఇడ్సిపెట్టు పోవే అంటూ హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. మరదలి ప్రేమ కోసం తపించిపోయిన హీరో చివరకు ఆమెను కాదనుకునే స్థితికి వస్తాడు. మొత్తానికి ట్రైలర్‌ ఎమోషనల్‌గా సాగింది. విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది.

 

చదవండి: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ రెండో రోజు కలెక్షన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement