పక్కా మాస్ యాక్షన్‌తో శ్రీకాంత్ నాటు కోడి | srikanth new movie is mass entertainer | Sakshi
Sakshi News home page

పక్కా మాస్ యాక్షన్‌తో శ్రీకాంత్ నాటు కోడి

Feb 7 2014 11:58 PM | Updated on Aug 21 2018 5:44 PM

పక్కా మాస్ యాక్షన్‌తో శ్రీకాంత్ నాటు కోడి - Sakshi

పక్కా మాస్ యాక్షన్‌తో శ్రీకాంత్ నాటు కోడి

లంచగొండి పోలీస్ అధికారిగా శ్రీకాంత్ నటిస్తున్న చిత్రం ‘నాటుకోడి’. ‘దేవరాయ’ చిత్రం తర్వాత నానికృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రమిది.

 లంచగొండి పోలీస్ అధికారిగా శ్రీకాంత్ నటిస్తున్న చిత్రం ‘నాటుకోడి’. ‘దేవరాయ’ చిత్రం తర్వాత నానికృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. మనోచిత్ర కథానాయిక. నానిగాడి సినిమా పతాకంపై నానికృష్ణ, బందరు బాబి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్క పాట మినహా సినిమా పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శ్రీకాంత్ విభిన్నంగా కనిపిస్తారు. ఇప్పటివరకూ ఇలాంటి పాత్రను శ్రీకాంత్ చేయలేదు. అందర్నీ అలరించేలా ఆయన పాత్ర ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో 40 రోజులు ఏకధాటి షెడ్యూలు చేశాం.
 
  ఈ నెలాఖరున బ్యాలెన్స్ సాంగ్ చిత్రీకరిస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, రావు రమేష్, సలీం పాండా, కారుమంచి రఘు, జీవా, ప్రభు, కాదంబరి కిరణ్, జయవాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: సి.మల్లేష్ నాయుడు, ఎడిటింగ్: రమేష్, కళ: జె.కె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement