అందాలార బోతకు నేనూ సై | Sakshi
Sakshi News home page

అందాలార బోతకు నేనూ సై

Published Sat, Jan 28 2017 1:55 AM

అందాలార బోతకు నేనూ సై

సినిమాకు గ్లామర్‌ ఒక భాగంగా మారిన రోజులివి. ఆ బాధ్యతనిప్పుడు కథానాయికలే సమర్థవంతంగా నిర్వహించేస్తూ తమ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని నటి నయనతార, అనుష్క, తమన్నా, హన్సిక వంటి బ్యూటీస్‌ ముందుగానే కనిపెట్టి ఆ విధంగా అందాలను వెండి తెరపై విచ్చలవిడిగా ఆరబోసి అగ్రనాయికల స్థానాన్ని అందిపుచ్చుకున్నారు. యువ నటి శ్రీదివ్యకీ విషయం ఆలస్యంగా అవగతం అయినట్లుంది. తాజాగా అందాలారబోతకు నేను సైతం అంటూ దర్శక నిర్మాతలకు గ్రీన్  సిగ్నల్‌ ఇస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌.

నటుడు శివకార్తికేయన్ కు జంటగా వరుత్తపడాద వాలిభర్‌ సంఘం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన పదహారణాల తెలుగమ్మాయి శ్రీదివ్య. ఆ చిత్రంలో చక్కగా లంగా ఓణీ ధరించి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సంపాందించుకోవడంతో పాటు, తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. ఆ తరువాత జీవా, కాక్కీసటైæ్ట. ఈటీ, మరుదు, బెంగళూర్‌ నాట్కల్, కాషో్మరా, మా వీరన్  కిట్టు ఇలా చాలా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాందించుకుంది. శ్రీదివ్య నటించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ హోమ్లీ పాత్రల్లోనే కలిపించారని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఈ భామకు సక్సెస్‌ శాతం బాగా పడిపోయింది. అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం జీవాకు జంటగా నటిస్తున్న సంగిలి పుంగిలి కదవై తోర చిత్రం మాత్రమే చేతిలో ఉంది.

ఈ మధ్య విడుదలైన మా వీరన్  కిట్టు చిత్రంపై శ్రీదివ్య చాలా ఆశలు పెట్టుకుంది. అయితే అది చాలా నిరాశనే మిగిల్చింది. అంతే కాదు అమ్మడికి ఇక్కడ కొత్త అవకాశాలేమీ రావడం లేదు. దీంతో సొంత గడ్డపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే అక్కడ కొన్ని అవకాశాలు వస్తున్నా, గ్లామరస్‌గా నటించాలన్న డిమాండ్‌ వస్తోందట. దీంతో మరో దారి లేని శ్రీదివ్య గ్లామరే శరణ్యం అనుకుని అందాలారబోతకు సై అంటున్నారట. అంతే కాదు నిండా మునిగిన తరువాత చలేమిటన్న చందాన కోలీవుడ్‌లోనూ తనకు తెలిసిన దర్శకులకు తాను గ్లామర్‌కు రెడీ అని సిగ్నల్స్‌ పంపిస్తోందట. అయితే గ్లామర్‌గా నటించడానికి సిద్ధం అన్నానని మరీ శృంగారనటిగా మార్చకండి అంటూ విన్నవించుకుంటునట్లు కోలీవుడ్‌లో చాలా వేగంగా జరుగుతున్న ప్రచారం.

Advertisement
 
Advertisement