శ్రీదేవి హ్యాట్రిక్! | Sridevi to act in Salman Khan's next | Sakshi
Sakshi News home page

శ్రీదేవి హ్యాట్రిక్!

Aug 23 2016 12:17 AM | Updated on Sep 4 2017 10:24 AM

శ్రీదేవి హ్యాట్రిక్!

శ్రీదేవి హ్యాట్రిక్!

అతిలోక సుందరి శ్రీదేవి రీ-ఎంట్రీలో హ్యాట్రిక్ నమోదు చేశారు. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’తో శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అతిలోక సుందరి శ్రీదేవి రీ-ఎంట్రీలో హ్యాట్రిక్ నమోదు చేశారు. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’తో శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదు కదా? హ్యాట్రిక్ ఏంటని ఆలోచిస్తున్నారా? ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లో శ్రీదేవి అమ్మగా నటించారు. భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మామ్’లోనూ అమ్మగానే కనిపించనున్నారు.
 
  తాజాగా విపుల్ షా దర్శకత్వంలో శ్రీదేవి ప్రధాన పాత్రధారిగా సల్మాన్‌ఖాన్ ఓ సినిమా నిర్మించనున్నారనే వార్త బయటకొచ్చింది. తల్లీకొడుకుల కథతో తెరకెక్కబోయే ఈ సినిమాలో ముచ్చటగా మూడోసారి శ్రీదేవి అమ్మగా కనిపిస్తారని బాలీవుడ్ టాక్. సౌత్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన ‘పులి’లోనూ హన్సిక తల్లిగా రాణి పాత్రలో శ్రీదేవి నటించినా, హిందీలోనూ వరుసగా అమ్మ పాత్రలే చేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే రీ-ఎంట్రీలో అమ్మగా హ్యాట్రిక్ నమోదు చేసినట్టే కదా!
 

Advertisement
 
Advertisement
Advertisement