రష్యాలో శ్రీదేవి ‘మామ్‌’ | sridevi mom movie to release in russia | Sakshi
Sakshi News home page

రష్యాలో శ్రీదేవి ‘మామ్‌’

Nov 10 2017 4:19 PM | Updated on Nov 10 2017 4:19 PM

sridevi mom movie to release in russia - Sakshi

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముఖ్య పాత్ర పోషించిన మామ్‌ సినిమాను రష్యాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ముంబై: అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముఖ్య పాత్ర పోషించిన మామ్‌ సినిమాను రష్యాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రష్యాలో మామ్‌ను 'మామా' గా విడుదల చేస్తున్నారు. విడుదలకు ముందుగానే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రష్యన్‌ ఫలిం ఫెస్టివల్‌లో ప్రముఖంగా ప్రదర్శించనున్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా రష్యాలో విడుదల చేయనున్న బాలీవుడ్‌ సినిమా ఇదే కావటం విశేషం. త‌న పిల్ల‌ల కోసం ఎలాంటి సాహ‌సానికైనా, ఎలాంటి అసాధార‌ణ పోరాటానికైనా సిద్ధ‌ప‌డే ఓ మాతృమూర్తి క‌థే మామ్ సినిమా.

రవి ఉడ్యావర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్‌ సిద్దిఖి, అక్షయ్‌ఖన్నా, సజల్‌ అలీ, అద్నాన్‌ సిద్దిఖి, అభిమన్యుసింగ్‌ కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ చిత్రాన్ని దేశ‌, విదేశాల్లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తోంది. శ్రీ‌దేవి కెరీర్‌లో 300వ సినిమా .. ఇలా విదేశీ ఫిలిం ఫెస్టివల్స్‌కు వెళ్లి భారతీయ సినిమా కీర్తిని మ‌రింత‌గా పెంచ‌డం మెచ్చుకోదగిన అంశం

Advertisement
 
Advertisement
Advertisement