చైనాలో బాలీవుడ్‌ హవా! | Sridevi MOM Movie Collected 100 Crores In China | Sakshi
Sakshi News home page

చైనాలో బాలీవుడ్‌ హవా!

May 27 2019 3:57 PM | Updated on May 27 2019 3:57 PM

Sridevi MOM Movie Collected 100 Crores In China - Sakshi

ఇండియాలో చైనా వస్తువుల హవా కొనసాగుతుంటే.. చైనా మార్కెట్‌లో మాత్రం ఇండియన్‌ మూవీస్‌ సత్తా చాటుతున్నాయి. చైనాలో రిలీజ్‌ అయిన పలు బాలీవుడ్‌ చిత్రాలు ఇండియాలో కలెక్ట్‌ చేసిన దానికంటే ఎక్కువగా వసూళ్లు చేస్తున్నాయి. ఈ ఏడాది చైనాలో విడుదలైన అంధాదున్‌, మామ్‌ చిత్రాలు అక్కడి బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాయి. ఇప్పటికే అంధాదున్‌ 350కోట్లకు పైగా కలెక్ట్‌ చేయగా.. మామ్‌ సైతం వసూళ్లలో దూసుకుపోతోంది.

గతవారం రిలీజ్‌ అయిన శ్రీదేవి ‘మామ్‌’  చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మూవీ వందకోట్లను కలెక్ట్‌ చేసినట్లు నిర్మాత బోనీ కపూర్‌ ప్రకటించారు. ఆమీర్‌ ఖాన్‌ పీకే చిత్రం బాలీవుడ్‌ మార్కెట్‌కు దారులు తెరవగా.. దంగల్‌ చిత్రంతో ఇండియన్‌ మూవీలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌, హిందీ మీడియం, భజరంగీ భాయిజాన్‌, హిచ్‌కీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌ నుంచి వెళ్లిన అంధాదున్‌, మామ్‌ చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement