Sri Reddy: My Leaks will continue, given the warning to Jeevitha and Nagababu about her targets - Sakshi
Sakshi News home page

సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి పోస్టులు

Apr 18 2018 1:08 PM | Updated on Mar 22 2019 5:33 PM

Sri Reddy Warns Jeevitha And Nagababu And Told That Leaks Will Continue - Sakshi

హైదరాబాద్‌: కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ఏకకాలంలో ప్రశంసలు, విమర్శలుఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డి..‘ఈ జీవితం ఇక చాలు! ఫస్ట్‌టైమ్‌ ఒంటరినయ్యాను.. అందరికీ ధన్యవాదాలు’ అంటూ వైరాగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మొబైల్‌ స్విచాఫ్‌ చేయడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. అయితే, కొద్ది గంటల తర్వాత తిరిగి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యారామె. తనపై వస్తున్న అన్ని విమర్శలకు బదులిస్తానని అన్నారు. ఈక్రమంలో సీనియర్‌ నటులు జీవితా రాజశేఖర్‌, నాగబాబులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. అతిత్వరలోనే అందరి బండారం బయటపెడతానని రాసుకొచ్చారు.

తొలి టార్గెట్‌ జీవితా రాజశేఖర్‌..: ‘‘వెనుకడుగు వేసే పరిస్థితి లేదిప్పుడు. నా పోరాటం కొనసాగుతుంది. చావో రేవో ఏదో ఒకటి తేల్చుకునేదాకా ఆగను. ఇకముందు ప్రతి విషయంలో పారదర్శకంగా ఉంటాను. నా జీవిత చరిత్రను చెప్పేస్తాను. నాదేకాదు సంబంధిత వ్యక్తులందరి చరిత్రలూ బయటపెడతాను. ఏ అంశమైనా చట్టపరంగా ముందుకు వెళ్లాలన్న పవన్‌ కల్యాణ్‌గారి సూచనను స్వీకరిస్తున్నాను. నా దగ్గరున్న ఆధారాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాను. న్యాయపోరాటంలో భాగంగా అందరికంటే ముందు జీవితా రాజశేఖర్‌తో తలపడతాను. ఆధారాలను ఒక్కొక్కటిగా వదులుతాను’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

బాబుగారూ.. మానసిక వైద్యం చేయించుకోండి: మొన్న పవన్‌ కల్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు  చేసి, క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి.. తాజాగా మెగా సోదరుడు నాగబాబుపై విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన నాగబాబు శ్రీరెడ్డి వ్యవహారం పక్కదారి పట్టిందని, అవగాహన లేకుంటే ‘మా’ను కించపర్చొద్దని అన్నారు. బుదులుగా శ్రీరెడ్డి.. ‘మీకు తప్పకుండా సరైన సమాధానం చెబుతా. మంచితనం ముసుగులో బతుకుతున్న మీరు మానసిక వైద్యం చేయించుకోండి’’ అని రాసుకొచ్చారు.
(చదవండి: ‘అలా అయితే నా కూతురిని సినిమాల్లోకి ఎలా తెస్తాను’)

(పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement