బాలు పాట హైలైట్‌

SP Balu sings song for Cheema Prema Madhyalo Bhama - Sakshi

అమిత్, ఇందు, సుమన్, హరిత ముఖ్య తారలుగా శ్రీకాంత్‌ శ్రీ అప్పలరాజు  దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చీమ–ప్రేమ.. మధ్యలో భామ’. చీమ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని మాగ్నమ్‌ ఓపస్‌ ఫిలిమ్స్‌పై లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘ఈగ’ సినిమా మాకు స్ఫూర్తి. చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దం పట్టేలా ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు టైటిల్‌ సాంగ్‌ని అద్భుతంగా ఆలపించారు. రవివర్మగారి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట పదికాలాలు అందర్నీ అలరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్‌ లలాని.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top