అమెరికాలో ఎస్పీబాలుకు చేదు అనుభవం | SP Balasubrahmanyam's passport, other articles stolen in the US | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఎస్పీబాలుకు చేదు అనుభవం

Apr 5 2017 3:59 PM | Updated on Aug 24 2018 7:24 PM

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ‍్యం కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది.

చెన్నై: సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ‍్యం కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో పర్యటనలో ఉన్నఆయనను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. హూస్టన్‌లో ‘ఎస్పీబీ50’  టూర్‌లో ఉండగా తన బ్యాగ్‌ను దుండగులు ఎత్తుకు పోయారని తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు. దుండగులు తీసుకెళ్లిన బ్యాగులో పాస్‌పోర్టులు, క్రెడిట్‌ కార్డులు, కొంత నగదు, పాటల స్క్రిప్టులు ఉన్నాయని తెలిపారు. అయితే, హూస్టన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం అధికారుల సాయంతో 24 గంటల్లోనే డూప్లికేట్‌ పాస్‌పోర్టును పొందినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సియాటిల్‌, లాస్‌ఏంజెల్స్‌, అట్లాంటాల్లో పర్యటిస్తున్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement