మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్‌ హీరోగా! | Sony Pictures Joins Hands With Mahesh Babu for Major | Sakshi
Sakshi News home page

మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్‌ హీరోగా!

Published Wed, Feb 27 2019 4:33 PM | Last Updated on Wed, Feb 27 2019 4:52 PM

Sony Pictures Joins Hands With Mahesh Babu for Major - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాక నిర్మాతగానూ మంచి ఫాం చూపిస్తున్నాడు. ఇన్నాళ్లు తన చిత్రాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన మహేష్‌, ఇప్పుడు ఇతర హీరోలతో, ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య డిజిటల్‌ రంగంలోకి అడుగు పెట్టి చార్లీ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నట్టుగా తెలిపాడు. తాజాగా మరో బిగ్‌ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు సూపర్‌ స్టార్‌.

క్షణం, గూఢచారి లాంటి సూపర్‌ హిట్ సినిమాలతో అలరించిన అడవి శేష్‌ హీరోగా ఓ బయోగ్రాఫికల్‌ మూవీని నిర్మిస్తున్నాడు మహేష్‌. ఈ సినిమాలో బాలీవుడ్ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ సోని పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ తెలుగులోకి అడుగుపెట్టబోతోంది. అంతేకాదు ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందనుండటంతో ఈ సినిమాలో మహేష్‌ నిర్మాతగా బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు.

మేజర్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 26/11 ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన ఎన్‌ఎస్‌జీ కమాండో మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ వీరోచిత పోరాటం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మరోసారి అడవి శేష్ కథా కథనాలు అందిస్తున్న ఈ సినిమాకు గూఢచారి ఫేం శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలు సోని పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థలు ఒక ప్రకటన విడుదల చేశారు. అడివి ఎంటర్‌టైన్మెంట్స్‌, శరత్ చంద్ర, ఏ+ఎస్‌ మూవీస్‌ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈసినిమా షూటింగ్ 2019 వేసవిలో ప్రారభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2020లో సినిమా విడుదలకానుంది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement