ట్విటర్‌కు బైబై చెప్పిన స్టార్‌ హీరోయిన్‌!!

Sonam Kapoor Signs Off From Twitter For A While - Sakshi

‘కొన్నాళ్లు ట్విటర్‌కు విరామం ఇస్తున్నాను. ఇక్కడంతా నెగిటివిటీ ఉంది. లవ్‌ యూ ఆల్‌’ అంటూ ట్విటర్‌ నుంచి కొంత కాలం పాటు సైన్‌ ఆఫ్‌ అవుతున్నట్లు ప్రకటించారు బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా సోనమ్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం కాలుష్యం. అవునా అలా ఎలా అంటూ ఆశ్చర్యపోకండి. అసలు విషయమేమిటంటే..‘ నగరానికి చేరుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఇంకా గమ్యాన్ని మాత్రం చేరుకోలేదు. రోడ్లు చాలా చెత్తగా ఉన్నాయి. ఇక కాలుష్యం గురించి చెప్పనవసరం లేదు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే తెలియని భయం వెంటాడుతుంది’ అంటూ దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ తన ట్రావెలింగ్‌ అనుభవం గురించి సోనమ్‌ కపూర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

సోనమ్‌ పోస్ట్‌కు స్పందించిన ఓ నెటిజన్‌... ‘ తక్కువ ఇంధనంతో ఎక్కువ మైలేజీ ఇచ్చే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించని, విలాసాలకు అలవాటు పడిన మీలాంటి సెలబ్రిటీల వల్లనే ఈ సమస్యలు. మీరు ఉపయోగించే లగ్జరీ కార్లు 3, 4 కంటే ఎక్కువ కిలోమీటర్ల మైలేజీ ఇవ్వవు. అంతేకాదు మీ ఇళ్లలో మినిమమ్‌ ఓ 20 ఏసీలు ఉంటాయి. కాబట్టి గ్లోబల్‌ వార్మింగ్‌లో మీ పాత్ర కూడా ఉంది. ముందు మీ వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టండి ఆ తర్వాతే.... అంటూ సోనమ్‌కు రిప్లై ఇచ్చాడు. ఇందుకు ప్రతిగా.. ‘నీలాంటి మగవాళ్లు ఉంటారు కాబట్టే మహిళలు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించాలంటే భయపడతారు. ఎందుకంటే అక్కడ కూడా వేధింపులు ఉంటాయి కదా’  అంటూ సోనమ్‌ అతడిని ఘాటుగా విమర్శించారు. ఈ క్రమంలో అతడికి మద్దతుగా నిలిచిన మరికొంత మంది నెటిజన్లు సోనమ్‌కు వ్యతిరేకంగా ద్వేషపూరిత ట్వీట్లు చేశారు. దీంతో చిన్నబుచ్చుకున్న సోనమ్‌ ట్విటర్‌కు బై బై చెప్పేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top