మీ ప్రేమే నా బలం: సోనమ్‌ కపూర్‌

Sonam Kapoor Post Heart Touching Message About Her Parents In Instagram - Sakshi

అనిల్‌ కపూర్‌ గారాల పట్టి సోనమ్‌ కపూర్‌ వివాహ వేడుక ఎంత వైభవంగా జరిగిందో అందరికి తెలిసిన విషయమే. మెహందీ, సంగీత్‌, వివాహం, రిసెప్షన్‌ ఇలా ప్రతి వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా నిర్వహించారు కుటుంబ సభ్యులు. తన వివాహ వేడుకను ఇంత ఘనంగా, వైభవంగా నిర్వహించిన తల్లిదండ్రులకు, ఆప్తులకు కృతజ్ఞతలు తెలిపారు సోనమ్‌. ఈ సందర్భంగా తన ఇన్‌స్టామ్‌గ్రామ్‌లో ఒక మెసేజ్‌ను పోస్టు చేశారు.

‘మా వివాహన్ని ఆశిర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రెండురోజుల ఈ వేడుక మా  జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఇంత అద్భుతంగా మలచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. అలానే కుటుంబాన్ని ఉద్ధేశించి మరో పోస్టులో ‘మా కుటుంబమే మా బలం. కపూర్‌ కుటుంబ సభ్యులందరికి చాలా ధన్యవాదాలు. సునీత నువ్వు ఈ ప్రపంచంలోనే అందరికంటే మంచి అమ్మవి. నాన్న నువ్వు నన్ను, ఆనంద్‌ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్‌...మీ ప్రేమకు, మద్దతకు చాలా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ నెల 8న సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ అహుజాల వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తుల మధ్య పంజాబీ సంప్రదాయం ప్రకారం చాలా వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుకకు అమితాబ్‌, బాలీవుడ్‌ ఖాన్‌త్రయంతో పాటు కత్రినా, రాణి ముఖర్జీ హజరయ్యారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top