‘సెలబ్రేషన్స్‌ మిస్సవుతున్నా...అయినా పర్లేదు’ | Sonali Bendre Emotional Post On Ganesh Chaturthi | Sakshi
Sakshi News home page

Sep 14 2018 9:24 AM | Updated on Sep 14 2018 9:35 AM

Sonali Bendre Emotional Post On Ganesh Chaturthi - Sakshi

పూజ చేస్తున్న సొనాలీ కుమారుడు రణ్‌వీర్‌ (ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటో)

ప్రతీ ఏడాదిలానే ఈరోజు కూడా మా ఇంట్లో గణనాథుని వేడుకలు జరిగాయి.

‘నా హృదయానికి ఎంతో దగ్గరైన పండుగ గణేశ్‌ చతుర్థి. ప్రతీ ఏడాదిలానే ఈరోజు కూడా మా ఇంట్లో గణనాథుని వేడుకలు జరిగాయి. అయితే ప్రస్తుతం నేను అక్కడ లేనుగా. అందుకే సెలబ్రేషన్స్‌ మిస్సవుతున్నా. అయినా ఫర్వాలేదు.. ఆ దేవుడి ఆశీస్సులు నాకు తోడుగా ఉంటాయి. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో మీ జీవితాలు నిండుగా ఉండాలంటూ’ సొనాలీ బింద్రే తన అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేశ్‌ చతుర్థి వేడుకులు జరుపుకొంటున్న తన కుటుంబ సభ్యుల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

కాగా హైగ్రేడ్‌ క్యాన్సర్‌ బారిన పడిన సొనాలీ ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సమయంలో భావోద్వేగానికి గురైన సొనాలి.. తన కొడుకు రణ్‌వీర్‌, ఇతర కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడుతున్నానని పేర్కొన్నారు. అయితే ఇటీవల సొనాలీ మరణించిందంటూ నకిలీ వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో ఆవేదన చెందిన ఆమె భర్త గోల్డీ బెల్‌.. ‘సొనాలీ ఎంతో ధైర్యంగా పోరాడుతున్నారని, ఆమె ఆరోగ్యం గురించి వదంతులు ప్రచారం చేయడం మానుకోవాలని’ విఙ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement