ప్యారీ పరిణీతీ... టిప్స్‌ చెప్పవా? | Sonakshi Sinha's crop-shirt is so cool, it's making us rethink our wardrobe | Sakshi
Sakshi News home page

ప్యారీ పరిణీతీ... టిప్స్‌ చెప్పవా?

Nov 5 2017 12:33 AM | Updated on Nov 5 2017 12:33 AM

Sonakshi Sinha's crop-shirt is so cool, it's making us rethink our wardrobe - Sakshi

...అనడుగుతున్నారట సోనాక్షీ సిన్హా! ఇంతకీ, ఏం టిప్స్‌ అడుగుతున్నారు? అంటే... వెయిట్‌ లాస్‌ టిప్స్‌ అట! ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? సోనాక్షి బొద్దుగా ఉన్నా... బీటౌన్‌ ప్రేక్షకుల అభిమానం బాగుంది కదా! అనే సందేహం రావొచ్చు. అయితే... మరింత స్లిమ్ముగా అవ్వాలని సోనాక్షి సీరియస్‌గా నిర్ణయం తీసుకున్నారట! ఎందుకంటే... ఎవరికీ తెలీదు. బట్, సల్మాన్‌ఖాన్‌ ‘దబాంగ్‌–3’ షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యేలోపు స్లిమ్‌ అవ్వాలనుకుంటున్నారు. యాక్చువల్లీ... హీరోయిన్‌ కాక ముందు సోనాక్షీ సిన్హా ఇంత కంటే బొద్దుగా ఉండేవారు.

ఒక్కసారి హీరోయిన్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాక చాలా బరువు తగ్గారు. అటువంటప్పుడు, ఓల్డ్‌ ఫార్ములా ఫాలో అవ్వొచ్చు కదా! పరిణీతి చోప్రాను టిప్స్‌ అడగడం ఎందుకు? అంటే... ఒకప్పుడు పరిణీతి కూడా సోనాక్షిలా బొద్దుగా ఉండేవారు. గత రెండేళ్లలో బాగా బరువు తగ్గారు. ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’లో పరిణీతిని చూసిన సోనాక్షి సర్‌ప్రైజ్‌ అయ్యారట! అందుకే, ఆమెను టిప్స్‌ చెప్పమని అడుగుతున్నారట! ‘దబాంగ్‌–3’లో సోనాక్షి ఎంత స్లిమ్ముగా కనిపిస్తారో... వెయిట్‌ అండ్‌ సీ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement