ఫలితాన్ని పట్టించుకోను

sobhita dhulipala talks about her web series movies - Sakshi

‘నటీనటులకు భాషా భేదాలు అనేవి ఉండకూడదు. ఒకకథ చెప్పడానికి ఏ భాషకైనా, ఏ ప్లాట్‌ఫామ్‌కి అయినా వెళ్లాలి’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. ‘గూఢచారి’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హైదరాబాదీ భామ ప్రస్తుతం హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూనే అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. విభిన్న భాషల్లో సినిమాలు చేయడం గురించి శోభిత మాట్లాడుతూ – ‘‘యాక్టర్‌గా నన్ను నేను కథకురాలిగా చూస్తాను. కథను ఏ భాషలో చెబుతున్నాం, ఏ ఫ్లాట్‌ఫామ్‌లో చెబుతున్నాం అనేది పెద్దగా పట్టించుకోను. ఫీచర్‌ ఫిల్మ్‌ అయినా వెబ్‌ అయినా ఒకటే ఆసక్తితో నా పాత్రను చేస్తాను. ఒక మంచి కథ ఉంటే నటిగా వంద శాతం కష్టపడతాను. ఫలితం పెద్ద పట్టింపు కాదు. ఆ ప్రక్రియను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top