మహేశ్‌కి విలన్‌గా సూర్య! | SJ Surya to play Villain Role in Mahesh-Murugadoss Movie | Sakshi
Sakshi News home page

మహేశ్‌కి విలన్‌గా సూర్య!

Jun 8 2016 11:55 PM | Updated on Jul 14 2019 1:42 PM

మహేశ్‌కి విలన్‌గా సూర్య! - Sakshi

మహేశ్‌కి విలన్‌గా సూర్య!

మహేశ్‌బాబు హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.

మహేశ్‌బాబు హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా దర్శకుడు ఎస్.జె. సూర్య నటిస్తారనే వార్త ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరోవైపు రజనీకాంత్ ‘2.0’లో విలన్‌గా నటిస్తున్న హిందీ నటుడు అక్షయ్‌కుమార్ పేరు కూడా వినిపించింది. ఫైనల్లీ యస్.జె. సూర్య ఖరారయ్యారు. ఈ విషయాన్ని చిత్రదర్శకుడు మురుగదాస్ స్వయంగా ప్రకటించారు.

దర్శకుడిగా తమిళంలో ‘వాలి’, తెలుగులో ‘ఖుషి’ చిత్రాలు సూర్యకు మంచి పేరు తెచ్చాయి. ఇంకా ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించారు. ఇప్పుడు మహేశ్‌బాబు సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. వచ్చే నెల 15న ఈ చిత్రం షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఈ చిత్రంలో నటిస్తూనే మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంతో ఎస్.జె. సూర్య బిజీ కానున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement