సింగిల్ ఎక్స్ | Single X | Sakshi
Sakshi News home page

సింగిల్ ఎక్స్

Feb 9 2016 12:19 AM | Updated on Sep 3 2017 5:11 PM

సింగిల్ ఎక్స్

సింగిల్ ఎక్స్

చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తీసి డెరైక్టర్లవుతుంటే, టాప్ డెరైక్టర్ రామ్‌గోపాల్‌వర్మ ఇప్పుడు షార్ట్ ఫిలిం తీయడానికి సిద్ధమవుతున్నారు.

చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తీసి డెరైక్టర్లవుతుంటే, టాప్ డెరైక్టర్ రామ్‌గోపాల్‌వర్మ ఇప్పుడు షార్ట్ ఫిలిం తీయడానికి సిద్ధమవుతున్నారు. ఆర్జీవీ టాకీస్ అనే నిర్మాణ సంస్థ పేరుతో షార్ట్ ఫిలిమ్స్‌ను తీయనున్నట్లు ఆయన తన ట్విట్టర్‌లో ప్రకటించారు. ‘‘ ‘సింగిల్ ఎక్స్’ పేరుతో ఓ ఎరోటిక్ థ్రిల్లర్‌ను మొదటి లఘు చిత్రంగా రూపొందిస్తున్నా. దీన్ని సెన్సార్ బోర్డ్‌కు అంకితమిస్తున్నా’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు.

రొమాంటిక్, హారర్ జానర్ లో ఎలాంటి చిత్రాలైనా రూపొందిస్తానని, అలాగని అడల్ట్ కామెడీలు, దేవుడి మీద , ఆటల మీద తాను సినిమాలు తీయబోనని ఆర్జీవీ స్పష్టం చేశారు. అయితే ఆర్జీవీ టాకీస్‌ను తన చిత్రాలకే పరిమితం చేయకుండా, ఇతరుల  షార్ట్ ఫిలిమ్స్‌కు కూడా వేదిక కల్పిస్తానని వర్మ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement