మెగా హీరో కోసం ఇద్దరు తమిళ హీరోలు | simbu, Dhanush sings for sai dharam tej | Sakshi
Sakshi News home page

మెగా హీరో కోసం ఇద్దరు తమిళ హీరోలు

Jul 28 2016 1:32 PM | Updated on Sep 4 2017 6:46 AM

మెగా హీరో కోసం ఇద్దరు తమిళ హీరోలు

మెగా హీరో కోసం ఇద్దరు తమిళ హీరోలు

ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కనపెట్టి ఒకరి సినిమాకు మరొకరు కావలసినంత సాయం చేసుకుంటున్నారు. ఎక్కువగా ఆడియో వేడుకలకు హాజరవుతూ సినిమా ప్రమోషన్లో భాగం...

ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కనపెట్టి ఒకరి సినిమాకు మరొకరు కావలసినంత సాయం చేసుకుంటున్నారు. ఎక్కువగా ఆడియో వేడుకలకు హాజరవుతూ సినిమా ప్రమోషన్లో భాగం పంచుకుంటున్నారు. తాజాగా మరో ట్రెండ్ మొదలైంది. ఒకరు హీరోగా నటిస్తున్న సినిమాలో మరో హీరో పాట పాడి ఆ సినిమాకు మరింత క్రేజ్ తీసుకు వస్తున్నారు.

గతంలో శింబు లాంటి ఒకరిద్దరు స్టార్లు ఈ ప్రయోగం చేసినా.. ప్రస్తుతం ఎక్కువగా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు మన యంగ్ హీరోలు. ఇప్పటికే ఓ కన్నడ సినిమా కోసం ఎన్టీఆర్ పాట పాడగా.. తాజాగా ఓ తెలుగు సినిమా కోసం ఏకంగా ఇద్దరు తమిళ స్టార్ హీరోలు పాటలు పాడారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తిక్క సినిమా కోసం ధనుష్, శింబులు పాటలు పాడారు.

ఓం 3డి ఫేం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో 'తిక్క... తిక్క..'  అంటూ సాగే టైటిల్ సాంగ్ను ధనుష్ ఆలపించగా, 'హీ ఈజ్ హాట్ షాట్ హీరో' అనే హుషారైన పాటను శింబు పాడాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 30న సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement