పిజ్జా దర్శకునితో యాక్షన్ డ్రామా | Siddharth's Movie With 'Pizza' Director | Sakshi
Sakshi News home page

పిజ్జా దర్శకునితో యాక్షన్ డ్రామా

Jan 12 2014 12:52 AM | Updated on Sep 2 2017 2:31 AM

పిజ్జా దర్శకునితో యాక్షన్ డ్రామా

పిజ్జా దర్శకునితో యాక్షన్ డ్రామా

సిద్దార్థ్, లక్ష్మీమీనన్ జంటగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘జిగర్తతండా’ చిత్రం రూపొందుతోంది. తెలుగు వెర్షన్‌ని ఎస్.కె.పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సిద్దార్థ్, లక్ష్మీమీనన్ జంటగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘జిగర్తతండా’ చిత్రం రూపొందుతోంది. తెలుగు వెర్షన్‌ని ఎస్.కె.పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఒక షెడ్యూలు మినహా చిత్రం పూర్తయింది. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘‘కార్తీక్ సుబ్బరాజ్ ప్రతిభ ఏంటో ‘పిజ్జా’తోనే అందరికీ అర్థమైంది. ఇదొక వినూత్న కథాంశం. నగర నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా’’ అని చెప్పారు. మరో నిర్మాత వి.ఎస్.రామిరెడ్డి మాట్లాడుతూ -‘‘ఇందులో సిద్దార్థ్ పాత్ర అన్ని వర్గాలకూ నచ్చే విధంగా ఉంటుంది. ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో కీలకపాత్ర చేయబోతున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement