
టాప్ ఫైవ్‌లో నిలుస్తాడు!
ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘సిద్ధార్థ’. పరుచూరి బ్రదర్స్ గాడ్ ఫాదర్స్‌లా ఈ చిత్రం కోసం పనిచేశారు. హీరో సాగర్,
- నిర్మాత దాసరి కిరణ్ కుమార్
‘‘ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘సిద్ధార్థ’. పరుచూరి బ్రదర్స్ గాడ్ ఫాదర్స్‌లా ఈ చిత్రం కోసం పనిచేశారు. హీరో సాగర్, దర్శకుడు దయానంద్ నాకు గుడ్ ఫ్రెండ్స్. ఈ సినిమా విడుదల తర్వాత టాలీవుడ్‌లోని టాప్ ఫైవ్ డెరైక్టర్లలో దయానంద్ ఒకడిగా నిలుస్తాడు. సెప్టెంబర్ 2న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దాసరి కిరణ్ కుమార్ చెప్పారు. సాగర్, సాక్షీ చౌదరి, రాగిణి ప్రధాన పాత్రల్లో లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో కేవీ దయానంద్ రెడ్డి దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘సిద్ధార్థ’.
ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడు తూ- ‘‘విస్సుగారు మంచి కథ ఇచ్చారు. మణిశర్మగారి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్. ఈ చిత్రంతో సాగర్ వెండితెరపైనా తన కంటూ ఓ స్థానం సంపాదించుకుంటాడు’’ అని చెప్పారు. మంచి యూనిట్‌తో సినిమా చేశానని సాగర్ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ, సాక్షీ చౌదరి, రాగిణి, శంకర్, కోనేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.