breaking news
Producer Dasari Kiran Kumar
-
ఆయన అవకాశం ఇస్తే ఎన్ని కోట్లు అయినా పెట్టడానికి రెడీ!
‘‘ఎప్పటికీ నేను చిరంజీవిగారి అభిమానినే. మరణించేవరకూ అన్నయ్యంటే అభిమానం తగ్గదు. అన్నయ్య అవకాశం ఇస్తే ఆయన 151వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ నిర్మించాలని ఉంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ’’ అన్నారు నిర్మాత దాసరి కిరణ్‌కుమార్. సాగర్, రాగిణీ నంద్వాని, సాక్షి చౌదరి ముఖ్యతారలుగా ఆయన నిర్మించిన ‘సిద్ధార్థ’ ఈ నెల 16న విడుదలవుతోంది. కేవీ దయానంద్‌రెడ్డి దర్శకుడు. దాసరి కిరణ్‌కుమార్ చెప్పిన విశేషాలు... లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ.. కమర్షియల్ హంగులన్నీ ఉన్న చిత్రం ‘సిద్ధార్థ’. చక్కని ప్రేమకథ. సాగర్, రాగిణీల క్యారెక్టరైజేషన్లు, వారిద్దరి కెమిస్ట్రీ చిత్రానికి హైలైట్. బరువెక్కిన గుండెలతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకొస్తారు. అంత బలమైన కథతో రూపొందింది. రాజమౌళి, బోయపాటి శ్రీను, కొరటాల శివ తరహాలో దయానంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టాప్ ఫైవ్ దర్శకుల్లో చేరతాడు. పరుచూరి బ్రదర్స్, ఎస్.గోపాల్‌రెడ్డి, మణిశర్మ వంటి టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయడం హ్యాపీ. 30, 40 కోట్ల బడ్జెట్ మూవీ చూసినట్టే ఉంటుంది. సుమారు 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల్లో మంచి చరిష్మా ఉన్న హీరో అయితేనే ఈ కథకు న్యాయం చేయగలరు. భారీ స్టార్ హీరోకి కావల్సిన లక్షణాలన్నీ సాగర్‌లో ఉన్నాయి. ఏడేళ్లు టీవీలో తిరుగులేని బుల్లి తెర మెగాస్టార్ అన్పించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికీ, ప్రతి ప్రేక్షకుడికీ చేరువయ్యాడు. స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన షారుక్‌ఖాన్ బాలీవుడ్లో స్టార్‌గా ఎదిగారు. ‘ఢర్’, ‘బాజీఘర్’ చిత్రాల్లో షారుక్ నటనను మర్చిపోలేం. సాగర్ కూడా షారుక్‌లా స్టార్ అవుతాడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథ విన్నాను. చిరంజీవిగారు మాత్రమే చేయాల్సిన సినిమా. ‘మగధీర’, ‘బాహుబలి’ రేంజ్లో తీయాల్సిన మూవీ. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘వంగవీటి’ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నాం. ఆ సినిమా చూసి విజయవాడలో కత్తులు పడతారనుకోవడం అపోహే. ఇప్పటివరకూ కొత్తవారితో సినిమాలు తీశా. వచ్చే ఏడాది స్టార్స్‌తోనూ తీస్తా. -
టాప్ ఫైవ్‌లో నిలుస్తాడు!
- నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ‘‘ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘సిద్ధార్థ’. పరుచూరి బ్రదర్స్ గాడ్ ఫాదర్స్లా ఈ చిత్రం కోసం పనిచేశారు. హీరో సాగర్, దర్శకుడు దయానంద్ నాకు గుడ్ ఫ్రెండ్స్. ఈ సినిమా విడుదల తర్వాత టాలీవుడ్‌లోని టాప్ ఫైవ్ డెరైక్టర్లలో దయానంద్ ఒకడిగా నిలుస్తాడు. సెప్టెంబర్ 2న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దాసరి కిరణ్ కుమార్ చెప్పారు. సాగర్, సాక్షీ చౌదరి, రాగిణి ప్రధాన పాత్రల్లో లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో కేవీ దయానంద్ రెడ్డి దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘సిద్ధార్థ’. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడు తూ- ‘‘విస్సుగారు మంచి కథ ఇచ్చారు. మణిశర్మగారి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్. ఈ చిత్రంతో సాగర్ వెండితెరపైనా తన కంటూ ఓ స్థానం సంపాదించుకుంటాడు’’ అని చెప్పారు. మంచి యూనిట్‌తో సినిమా చేశానని సాగర్ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ, సాక్షీ చౌదరి, రాగిణి, శంకర్, కోనేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.