ఇద్దరు దేవదాసులు! | oka parvathi iddaru devadasulu movie latest update | Sakshi
Sakshi News home page

ఇద్దరు దేవదాసులు!

Aug 16 2025 3:14 AM | Updated on Aug 16 2025 3:14 AM

oka parvathi iddaru devadasulu movie latest update

కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీతో రూపొందిన చిత్రం ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ మీనన్, దిలీప్‌ హీరోలుగా, రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించారు. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతంపోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

‘‘పార్వతి దేవదాసుల ప్రేమకథకు ఎంతటి క్రేజ్‌ ఉందో తెలిసిందే. ఇప్పుడు ‘ఒక పార్వతి... ఇద్దరు దేవదాసులు’ టైటిల్‌తో ఓ విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాం. ముఖ్యంగా యువతీ యువకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. రఘుబాబు, కశి రెడ్డి రాజ్‌కుమార్, వీరశంకర్, గౌతం రాజు తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: మోహిత్‌ రహమానియాక్, కెమెరా: శ్రీనివాసరాజు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement