ఇండియాలో డాడీ వెయిటింగ్‌ | Shruti Haasan to play lead in Sanghamitra | Sakshi
Sakshi News home page

ఇండియాలో డాడీ వెయిటింగ్‌

Apr 19 2017 11:36 PM | Updated on Sep 5 2017 9:11 AM

ఇండియాలో డాడీ వెయిటింగ్‌

ఇండియాలో డాడీ వెయిటింగ్‌

ప్రస్తుతం శ్రుతీహాసన్‌ ఎక్కడ ఉన్నారు? లండన్‌లో. ఏం చేస్తున్నారు? సుందర్‌ సి దర్శకత్వంలో నటించే భారీ బడ్జెట్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ‘సంఘమిత్ర’

ప్రస్తుతం శ్రుతీహాసన్‌ ఎక్కడ ఉన్నారు? లండన్‌లో. ఏం చేస్తున్నారు? సుందర్‌ సి దర్శకత్వంలో నటించే భారీ బడ్జెట్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ‘సంఘమిత్ర’ కోసం కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటున్నారు. ‘సంఘమిత్ర’లో శ్రుతి వారియర్‌ ప్రిన్సెస్‌గా కనిపించనున్నారు. అయితే... ఇండియాలో ఉన్న కమల్‌ హాసన్‌ కూతురు ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.

 అమ్మాయి ఎక్కడో దూరంగా ఉంది, ఎలా ఉందోననే బెంగ మాత్రం కాదు. శ్రుతి ఆయనకు టైమ్‌ ఇస్తే... ‘శభాష్‌ నాయుడు’ షూటింగ్‌ ప్రారంభించాలనుకుంటున్నారు. కమల్‌ కాలికి గాయం కావడం ‘శభాష్‌ నాయుడు’ షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. అందువల్ల, ఆర్టిస్టులందరూ ఈ సినిమాకి కేటాయించిన డేట్స్‌ వేస్ట్‌ అయ్యాయి. ఇప్పుడు కమల్‌ పూర్తిగా కోలుకున్నారు.

 మళ్లీ షూటింగ్‌ ప్రారంభించాలనుకుంటే శ్రుతి బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితి గురించి కమల్‌ మాట్లాడుతూ – ‘‘మా టీమ్‌ అందరిలో శ్రుతి బిజీ ఆర్టిస్ట్‌. అదృష్టవశాత్తూ నేను తండ్రిని కావడంతో నాకు (నా సినిమాకు) ప్రయారిటీ ఇస్తుందనుకుంటున్నా. కొన్ని వారాలు ఇండియాలో, కొన్ని వారాలు విదేశాల్లో చిత్రీకరణ చేయాలి. ఆగస్టు కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నా’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement