వేదాంతంలోకి దిగిపోయిన శ్రుతి! | shruti haasan starts philosophising | Sakshi
Sakshi News home page

వేదాంతంలోకి దిగిపోయిన శ్రుతి!

Sep 23 2014 10:27 AM | Updated on Aug 25 2018 6:37 PM

వేదాంతంలోకి దిగిపోయిన శ్రుతి! - Sakshi

వేదాంతంలోకి దిగిపోయిన శ్రుతి!

మహేష్ బాబుతో 'ఆగడు' సినిమాలో 'జంక్షన్లో' అంటూ ఓ ఐటెం సాంగ్ చేసిన శ్రుతి హాసన్.. ఎందుకోగానీ ఉన్నట్టుండి వేదాంతంలోకి దిగిపోయింది.

మహేష్ బాబుతో 'ఆగడు' సినిమాలో 'జంక్షన్లో' అంటూ ఓ ఐటెం సాంగ్ చేసిన శ్రుతి హాసన్.. ఎందుకోగానీ ఉన్నట్టుండి వేదాంతంలోకి దిగిపోయింది. ప్రపంచం గురించి, విలువల గురించి చెప్పడం మొదలుపెట్టింది. ''నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో మారిపోతున్నట్లు అనిపిస్తోంది. దీన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నాకు విలువల గురించి నేర్పిన వాళ్లందరికీ చాలా కృతజ్ఞతతో ఉంటాను'' అని ట్వీట్ చేసింది. అంతకుముందు కూడా అందం ఉంటే చాలదు.. తెలివితేటలు కూడా ఉండాలంటూ చెప్పుకొచ్చింది.

కథానాయికగానే కాదు, సినిమాకు సంబంధించి ఏ చిన్న పాత్రలో కనిపించినా అది ప్రేక్షకులు గుర్తుండిపోయేలా ఉండాలి. చేసే పని పట్ల భక్తి, శ్రద్ధలుంటేనే జీవితంలో పైకొస్తాం అని చెప్పింది. కథానాయికలకు అందంతోపాటు తెలివితేటలు కూడా ఉండాలని, అవి లేనప్పుడు ఎంత అందం ఉన్నా వ్యర్ధమేనని తెలిపింది. ప్రస్తుతం విశాల్‌ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పూజ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ నెల 24న స్విట్జర్లాండ్‌ వెళ్తోంది. అది కూడా పూజ సినిమాలో ఓ పాట కోసమేనట.

 

Advertisement
 
Advertisement
Advertisement