నాన్నతోనే న్యూ ఇయర్ | Shruti Haasan spends with father Kamal Haasan on New Year celebrations | Sakshi
Sakshi News home page

నాన్నతోనే న్యూ ఇయర్

Jan 1 2014 4:44 AM | Updated on Oct 17 2018 4:29 PM

నాన్నతోనే న్యూ  ఇయర్ - Sakshi

నాన్నతోనే న్యూ ఇయర్

మనిషి ఆశా జీవి. ప్రేమ జీవి కూడా. అలాగే కోరికలు గుర్రాలపై స్వారీ చేస్తుంటాయి. స్వేచ్ఛా విహంగి కావాలని ఆశిస్తుంటారు. ఇక సెలెబ్రిటీల వారసుల విషయానికొస్తే స్వేచ్ఛ ఉన్నా

మనిషి ఆశా జీవి. ప్రేమ జీవి కూడా. అలాగే కోరికలు గుర్రాలపై స్వారీ చేస్తుంటాయి. స్వేచ్ఛా విహంగి కావాలని ఆశిస్తుంటారు. ఇక సెలెబ్రిటీల వారసుల విషయానికొస్తే స్వేచ్ఛ ఉన్నా సరైన రక్షణ మాత్రం కొరతనే చెప్పాలి. నటి శ్రుతిహాసన్ ఇటీవల అభిమాని నుంచి ఎదుర్కొన్న సంఘటనే ఉదాహరణ. ఒక ఆగంతకుడి దుస్సాహసం కారణంగా ఆమె భయభ్రాంతులకు గురైంది. దీంతోపాటు ఆమె తల్లిదండ్రులైన కమలహాసన్, సారికలను కలవరపరచింది. ఆ తరువాత శ్రుతిహాసన్ విషయంలో ఆమె తల్లి సారిక ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 
 
 శ్రుతిహాసన్‌ను సెల్‌ఫోన్‌లో కూడా మాట్లాడనీయకుండా ఆమె వ్యక్తిగత కార్యనిర్వాహకుడి ద్వారా సారికనే ప్రత్యుత్తరాలు సాగిస్తున్నారు. అయితే శ్రుతిహాసన్ గత కొంతకాలంగా టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో యమ బిజీగా ఉన్నారు. పండుగలు, పబ్బాలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని భావిస్తారు. నూతన సంవత్సర వేడుకలను సొంత వారితో పంచుకోవాలని ఆశిస్తారు. అయితే శ్రుతిహాసన్ మాత్రం రెండేళ్లుగా న్యూ ఇయర్‌ను కుటుంబ సభ్యులకు దూరంగానే గడుపుతున్నారట. అయితే ఈ ఏడాది మాత్రం తన తండ్రి క మలహాసన్‌తో కలసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోనున్నారట. ఈ బ్యూటీ చెన్నైలో సందడి చేయనున్నారన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement