శ్రుతి, అనిరుధ్ ఫోటో కలకలం | Shruti Haasan has late night fun with Anirudh! | Sakshi
Sakshi News home page

శ్రుతి, అనిరుధ్ ఫోటో కలకలం

Mar 6 2014 8:46 AM | Updated on Sep 2 2017 4:25 AM

శ్రుతి, అనిరుధ్ ఫోటో కలకలం

శ్రుతి, అనిరుధ్ ఫోటో కలకలం

నటి శ్రుతి హాసన్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ల మధ్య సాన్నిహిత్యం కోలీవుడ్లో కలకలం రేపుతోంది.

చెన్నై : నటి శ్రుతి హాసన్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ల మధ్య సాన్నిహిత్యం కోలీవుడ్లో కలకలం రేపుతోంది. 3 చిత్రంలో ధనుష్కు జంటగా శ్రుతిహాసన్ నటించింది. ఆ చిత్రంలో వారిద్దరి మధ్య లవ్ సన్నివేశాలు యూత్ను గిలిగింతలు పెట్టించాయి. ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయిన అనిరుధ్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఆ మధ్య నటి ఆండ్రియాతో రొమాన్స్ సన్నివేశాల ఫోటోలు నెట్లో ప్రచారమై కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

తాజాగా నటి శ్రుతిహాసన్తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్త పాతదే అయినా ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 3 చిత్రంలో షూటింగ్ సమయంలోనే శ్రుతి, అనిరుధ్కు మధ్య స్నేహం ఏర్పడింది. ఇటీవల అనిరుధ్ ఒక పాట పాడటానికి శ్రుతిహాసన్ను పిలిచాడు. హిందీ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న ఆమె అనిరుధ్ పిలిచిన వెంటనే వచ్చింది. పాట గురించి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా పాడేసింది.

అనంతరం ఇద్దరు నైట్ పార్టీలో పాల్గొన్నారు. అప్పుడు ఇద్దరు సన్నిహితంగా ఫోటోలు తీసుకున్నారు. శ్రుతి, అనిరుధ్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. అయితే వీరి మధ్య ఉన్నది స్నేహమేనా? దాన్ని మించిందేమయినా ఉందా? అన్నది త్వరలోనే బయటపడుతుందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అప్పటివరకూ వెయిట్ అండ్ సీ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement