ఫన్నీగాయ్‌! | Shruti Haasan Birthday Wishes to Michael Corsale | Sakshi
Sakshi News home page

ఫన్నీగాయ్‌!

Feb 19 2018 1:36 AM | Updated on Feb 19 2018 1:36 AM

Shruti Haasan Birthday Wishes to Michael Corsale  - Sakshi

మైఖేల్‌ కోర్స్‌లే, హీరోయిన్‌ శృతీహాసన్‌ మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఇండస్ట్రీ టాక్‌. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో కమల్‌హాసన్‌తో, మరో సందర్భంలో శృతి తల్లి సారికతో మైఖేల్‌ ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. దీంతో మైఖేల్, శృతి పెళ్లిపీటలెక్కబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని ఈ ఏడాది బర్త్‌డే సందర్భంగా చెప్పారు శృతి.

కానీ మైఖేల్‌పై మాత్రం ఫుల్‌ క్లారటీ ఇవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా మైఖేల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారామె. ‘‘ ప్రతి విషయంలో నాతో కలిసి నవ్వుతూ నవ్విస్తుంటాడు. నాకు తెలిసిన ఫన్నీగాయ్‌. హ్యాపీ బర్త్‌డే టు మై బెస్ట్‌ ఫ్రెండ్‌’’ అంటూ మైఖేల్‌కు పుట్టనరోజు శుభాకాంక్షలు తెలిపారు శృతి. అంతేకాదు ఈ టైమ్‌లో మైఖేల్‌ పక్కన తను లేకపోయినందుకు ‘ఐ యామ్‌ సారీ’ అని కూడా పేర్కొన్నారామె.

Advertisement
 
Advertisement
Advertisement