సినిమాల సంఖ్య తగ్గడంతో శ్రీయ పెళ్లి గురించి మీడియాలో గత రెండుమూడేళ్ల్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే...
సినిమాల సంఖ్య తగ్గడంతో శ్రీయ పెళ్లి గురించి మీడియాలో గత రెండుమూడేళ్ల్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే... వాటిని శ్రీయ కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అయితే... ఈ మధ్య పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు శ్రీయ వాయిస్‌లో కాస్తంత మార్పు కనిపించింది. ఈ టాపిక్ తెస్తే చాలు అంతెత్తున లేచే శ్రీయ... ఈ దఫా మాత్రం చిరునవ్వులు చిందిస్తూ... తనదైన శైలిలో రొమాంటిక్‌గా కళ్లు తిప్పుతూ సమాధానం ఇచ్చారు. 

