అర్థరాత్రి పార్క్లో శ్రద్ధాదాస్ ఏం చేసిందంటే.. | shraddhadas back to school days | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి పార్క్లో శ్రద్ధాదాస్ ఏం చేసిందంటే..

Nov 7 2016 10:54 AM | Updated on Sep 4 2017 7:28 PM

అర్థరాత్రి పార్క్లో శ్రద్ధాదాస్ ఏం చేసిందంటే..

అర్థరాత్రి పార్క్లో శ్రద్ధాదాస్ ఏం చేసిందంటే..

ఎంతో శ్రద్ధగా చేసిన బొమ్మలా ఉండే ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ అర్థరాత్రి సమయాల్లో చక్కర్లుకొడుతోంది.

ఎంతో శ్రద్ధగా చేసిన బొమ్మలా ఉండే ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ అర్థరాత్రి సమయాల్లో చక్కర్లుకొడుతోంది. నటించిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు ఒక్కసారిగా తన చిన్ననాటి స్కూల్ రోజుల్లోకి వెళ్లిపోయింది. తన ఇంటి సమీపంలో ఉన్న ఓ పార్క్కి  తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వెళ్లింది. అక్కడ చిన్నపిల్లల ఉయ్యాలపై ఊగుతూ తన చిన్ననాటి గుర్తులలను నెమరు వేసుకుంది. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ముంబైలో పుట్టిన ఈ బెంగాలీ అమ్మాయి ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఆర్య-2, డార్లింగ్, నాగవల్లి, మొగుడు, గుంటూర్ టాకీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement