ఎఫైర్ గురించి అడిగితే.. హీరోయిన్ ఫైర్ | Shraddha Kapoor slams the media | Sakshi
Sakshi News home page

ఎఫైర్ గురించి అడిగితే.. హీరోయిన్ ఫైర్

May 30 2016 3:44 PM | Updated on Sep 4 2017 1:16 AM

ఎఫైర్ గురించి అడిగితే.. హీరోయిన్ ఫైర్

ఎఫైర్ గురించి అడిగితే.. హీరోయిన్ ఫైర్

బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ తన భార్య ఆధునా భభానితో విడిపోయాక ఆయనపై పలు రూమర్లు వచ్చాయి.

ముంబై: బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ తన భార్య ఆధునా భభానితో విడిపోయాక ఆయనపై పలు రూమర్లు వచ్చాయి. ఫర్హాన్ తన సరసన నటించిన హీరోయిన్లతో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. 'వాజిర్' కో స్టార్  అదితిరావు హైదరితో డేటింగ్ చేసినట్టు బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత 'రాక్ ఆన్ 2' కోస్టార్ శ్రద్ధా కపూర్తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఫర్హాన్తో అనుబంధం గురించి వచ్చిన వార్తలపై స్పందించని శ్రద్ధా కపూర్ ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పింది. ఈ ప్రశ్న అడిగినందుకు మీడియా ప్రతినిధిపై ఫైర్ అయ్యింది. 'ప్రతి ఒక్కరికీ లిమిట్ ఉంటుంది. మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోరాదు. అందరి మనోభావాలను గౌరవించాలి' అని శ్రద్ధా కపూర్ క్లాస్ పీకింది.
 

Advertisement
 
Advertisement
Advertisement